కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్‌ వినియోగం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 4 గంటల పాటు అనధికార కోతలు విధిస్తుండటం గమనార్హం. | - | Sakshi
Sakshi News home page

కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్‌ వినియోగం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 4 గంటల పాటు అనధికార కోతలు విధిస్తుండటం గమనార్హం.

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:53 AM

కోటా

కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు వి

వ్యవసాయ విద్యుత్‌ అస్తవ్యస్తం

బోరు కింద మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. వ్యవసాయ విద్యుత్‌ అస్తవ్యస్తంగా ఉంది. త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇచ్చినట్లే ఇచ్చి తరచూ నిలిపేస్తున్నారు. ఇలా నిలిపేస్తుండటంతో 2 గంటల వరకు విద్యుత్‌ వృథా అవుతోంది. తొమ్మిది గంటలు ఇస్తున్నామని చెబుతున్నా రెండు, మూడుసార్లు నిలిపేస్తుండటంతో వ్యవసాయ పనులు సాగని పరిస్థితి. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే కొత్తది పెట్టడానికి ఐదారు రోజులవుతోంది.

– ఊలూరు మల్లయ్య, హొళగుంద

అనధికార విద్యుత్‌ కోతలతో

అవస్థలు

ప్రతిరోజూ రెండు మూడు గంటల చొప్పున అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. గాలులు వీచినా, వర్షాలు కురుస్తాయనుకున్న సమయంలో విద్యుత్‌ కోతలు మరింత అధికం. పవర్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆఫీసులకు ఫోన్‌ కాల్స్‌ చేసి విసిగిపోవాల్సిందే. అసలే వర్షాకాలం, ఆపై విద్యుత్‌ కోతలతో చిన్న పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం.

– బషీర్‌, మూలసాగరం, నంద్యాల

కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు వి1
1/1

కోటా కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నప్పుడు కోతలు వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement