జాతీయస్థాయి సైక్లింగ్‌లో విద్యార్థిని ప్రతిభ
ఓర్వకల్లు: మీదివేముల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని తంబళ్ల దివ్యశ్రీ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రథమ స్థానం నిలిచిన దివ్యశ్రీ అండర్ –14 విభాగంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు ప్రశంసా పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినికి ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు.


