విత్తనశుద్ధి కేంద్రాలపై దాడులు
నంద్యాల(అర్బన్): పట్టణ శివారులో ఉన్న పత్తి విత్తన శుద్ధి కేంద్రాల్లో వ్యవసాయాధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసాచార్యులు, వ్యవసాయాధికారి శివరామకృష్ణ, ఏడీఏ రాజశేఖర్ తదితరులు శ్రావణలక్ష్మి సీడ్స్, వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, హరినాథ్ క్రాఫ్ జెనిసీస్, భవ్యసీడ్స్, బబ్బూరి ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీవెంకటేశ్వర సీడ్స్, భారతి సీడ్స్, న్యూవెంకటేశ్వర సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఆయా విత్తనశుద్ధి కేంద్రాల్లో హెచ్‌టీ కాటన్(హెర్బిసైడ్ టోలరెంట్) స్ట్రిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలన్నారు.


