కుందూ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు
బండి ఆత్మకూరు: కుందూ నది నుంచి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమార్కులు జేసీబీలతో కుందూ నది నుంచి ఇసుక తవ్వడం ప్రారంభించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బండిఆత్మకూరు సమీపంలోని కుందూ నది నుంచి జేసీబీతో ట్రాక్టర్‌ల ద్వారా గురువారం ఇసుక తరలించారు. అలాగే పరమటూరు వద్ద కుందూ నది నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.


