చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
బనగానపల్లె: అర్ధరాత్రి భక్తి కెరటం ఎగిసింది. జ్యోతులు దేదీప్యమానంగా వెలుగొందాయి. ‘చల్లగా దీవించు తల్లీ’ అంటూ.. భక్తజనం చౌడేశ్వరి దేవి ముంగిట ప్రణమిల్లారు. నందవరంలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జ్యోతుల సమర్పణ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచి జ్యోతి మహోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సల్లో భాగంగా ముందుగా భాస్కరయ్య ఆచారి అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఒంటిగంట నుంచి గ్రామంలోని శ్రీ చెన్నకేశస్వామి దేవస్థానం తొగటవీర క్షత్రి యులు, భక్తులు జ్యోతులు తలపై పెట్టుకొని భక్తి గీతాలు పాడుకుంటూ మేళతాళాలతో బయల్దేరారు. మొదట సర్కార్ వారి జ్యోతి బయలుదేరగా.. మిగతా జ్యోతులు గ్రామ చావిడి, బస్టాండ్ మీదుగా చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నాయి. దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో భక్తులు నడుచుకుంటూ వచ్చి ఆలయ గర్భగుడిలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉత్సవంలో తొగటవీర క్షత్రియులు ప్రదర్శించిన కత్తి సాము ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సర్కార్ వారి జ్యోతి వద్ద భక్తుల రద్దీని నివారించేందుకు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 750 జ్యోతులకుపైగా రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జ్యోతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ అమ్మవారికి జ్యోతిని సమర్పించారు. గురువారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ముస్తాబు చేసి రఽథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ ముఖద్వారం వరకు భక్తులు రథాన్ని లాగారు. శుక్రవారం తిరుగు రథోత్సవం నిర్వహించన్నారు. ఈనెల 5వ తేదీన ఉత్సవాలు ముగియనున్నాయి.
వైభవంగా జ్యోతి మహోత్సవం
అబ్బుర పరిచిన తొగటవీర క్షత్రియుల విన్యాసాలు
కిటకిటలాడిన నందవరం
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..


