మహానంది: పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రైతులకు సూచించారు. శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గాజులపల్లె సమీపంలోని ఆంజనేయపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని పంటలకు అవసరమయ్యే నీటిని సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లాలో 3 వేల వరకు నీటి కుంటలు ఏర్పాటు చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు ఎండ తీవ్రతను దష్టిలో ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకోవాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల సూచనల మేరకు ఉపాధి హామీ పనులు సక్రమంగా పూర్తి చేసిన వారికి రోజుకు మూడు వందల రూపాయల వరకు వేతనం వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ మహమ్మద్ దౌలా, ఈఓఆర్డీ నాగేంద్రుడు, ఏపీఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి


