గోస్పాడు: చిన్నారుల ఆరోగ్యం దేశానికి సౌభాగ్యమని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా చిన్నారుల రవాణా సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచార చికిత్స క్యాంపుల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తారన్నారు. పుట్టుకతో వచ్చే నాలుగు రకాల వ్యాధులను గుర్తించి నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న డైస్ కేంద్రం, స్థానిక ఆసుపత్రులకు వైద్యులు రెఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తారన్నారు. అనంతరం ప్రపంచ డౌస్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, చిన్న పిల్లల వైద్య నిపుణులు అరుణజ్యోతి మాట్లాడుతూ.. జన్ను లోపంతో అటిజం, మెంటల్ రిటార్డినేషన్, హృదయ సంబంధ, మాట్లాడలేకపోవడం, నరాల సంబంధిత అవయవలోపాలు వంటి సమస్యలతో జన్మిస్తారన్నారు. ఈ పిల్లలకు సరైన సమయంలో సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్నారు.


