కర్నూలు(సెంట్రల్): ఎన్‌టీఆర్ కాలనీల్లో(జగనన్న కాలనీలు) నిర్మాణాల్లోని ఇళ్లకు అదనంగా ఆర్థిక సాయం మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. 2024 డిసెంబర్ 10వ తేదీ నాటికి నిర్మాణంలో ఉండి మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు అదనపు సాయం వర్తిస్తుందన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు ప్ర స్తుతం రూ.1.80 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్ర స్తుతం ఈ మొత్తానికి అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరవుతుందన్నారు. జిల్లాకు గత ప్రభుత్వంలో 39 వేల గృహాలు మంజూరు కాగా, 22,590 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.ఇళ్లు లేని వారికి పట్టణా ల్లో రెండుసెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలను ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీరిస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో 39 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. విలేకరుల సమావేశ ంలో హౌసింగ్ పీడీ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతు విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రయోజనాలు
నంద్యాల(అర్బన్): భూమి గల ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కార్డు పొందితే ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో బుధవారం ఏఓ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ, యాంత్రికీకరణ పరికరాలు మంజూరు చేసిందన్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడీఏ రాజశేఖర్, ఏఈఓ మనోహర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది కిరణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.