
నిజ బృందావన దర్శనం
మంత్రాలయం: ఏకాదశి పురస్కరించుకుని ఆదివారం భక్తులకు రాఘవేంద్రుల నిజ మూల బృందావన దర్శనం కలిగింది. ఏకాదశి పర్వదినాన శ్రీమఠంలోఎలాంటి పూజలు, ఉత్సవాలు చేపట్టక పోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి తులసి మాల, సన్యాస వస్త్రంతో అలంకరణ చేశారు. భక్తులకు నిజ బృందావన దర్శన భాగ్యం కల్పించారు. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు, పండితులు, బ్రాహ్మణులు ఉపవాస దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు ఉపవాస దీక్ష ముగియనుంది.
రాఘవేంద్రుల నిజ మూల బృందావనం