నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్‌లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్‌లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్‌లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్‌లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్‌లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, సంధ్యారాణి, కళ్యాణి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
మునుగోడు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, ప్రతిఒక్కరు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ సుశీందర్‌రావు కోరారు. శుక్రవారం మునుగోడులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి, ఎంఈఓ మల్లేషం, హెచ్‌ఎం సుంకరి భిక్షంగౌడ్, వెంకట్‌నారాయణ, యూసుఫ్‌పాషా పాల్గొన్నారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు
నల్లగొండ టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో సంఘమిత్ర కోఆపరేటీవ్, అర్బన్ బ్యాంకు ముందంజలో ఉందని బ్యాంక్ ఫౌండర్, చైర్మన్ సంగం రామకృష్ణ తెలిపారు. శుక్రవారం బ్యాంకు 28వ వార్షికోత్సవ వేడుకలు బ్యాంకు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగం రామకృష్ణ మాట్లాడుతూ 1998లో బ్యాంకును స్థాపించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పున్న చండీకేశ్వర్, కొంగరి భిక్షం, గజ్జల వెంకటేశ్వర్లు, గుండ్ల అంజిరెడ్డి, ఎర్రమల్ల లక్ష్మీనర్సు, చెరిపల్లి పద్మ, వీరవెల్లి భవాని, రేణిగుంట చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


