చండూరు : చండూరు మండలం దోనిపాములలో అగ్రిప్రమాదానికి గుడిసె దగ్ధమై ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ బండారు యాదగిరి కలిసారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘ఆదుకోండి సారూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఎంపీడీఓ యాదగిరి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఇందిరమ్మ రెండో విడతలో వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.


