సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

నల్లగొండ టౌన్‌: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాహుల్‌ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్‌ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్‌ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాలు, నీళ్ల విరోచనాలు, ఓఆర్‌ఎస్‌ ఉపయోగం, వాడే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ పద్మ వైద్యాధికారులకు వివరించారు. సమావేశంలో డాక్టర్‌ కేవీఎన్‌ కృష్ణకుమారి, డాక్టర్‌ నగేష్‌, డాక్టర్‌ శంకర్‌, డీపీఓ విష్ణు, మాతా శిశు సంక్షేమ అధికారి డాక్టర్‌ దీప పాల్గొన్నారు.

ఫ డీఎంహెచ్‌ఓ రాహుల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement