నిధులు లేక.. | - | Sakshi
Sakshi News home page

నిధులు లేక..

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

రూ. 40 కోట్ల వరకు నిధులు పెండింగ్‌

జిల్లాలో ఒక కార్పొరేషన్‌తోపాటు మరో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు నెలకు సరాసరిగా రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ నిధులతో స్థానిక అవసరాలైన స్మశాన వాటికలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతుంటారు. అయితే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్ల వరకు నిధులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

నల్లగొండ టూటౌన్‌: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు నెలనెలా విడుదల కావాల్సిన ‘పట్టణ ప్రగతి’ నిధులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు కాకపోవడంతో పట్టణాల ప్రగతి పూర్తిగా ఆగిపోయింది. నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ పట్టణాలకు గత ఏడాది (2025) జూలై నుంచి ఇప్పటివరకు పట్టణ ప్రగతి నిధుల మంజూరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు సకాలంలో రాక ఇబ్బందులు పడగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి నెలకొంటుండడంతో పట్టణాల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

చిన్న మున్సిపాలిటీల అవస్థలు

ముఖ్యంగా చిన్న మున్సిపాలిటీలు నిధుల కొరతతో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనీసం చిన్నపాటి మరమ్మతులు లేదా అత్యవసర పనులు చేపట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఉందని పలువురు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పట్టణ ప్రగతి నిధులను నెలనెలా విడుదల చేస్తేనే మున్సిపాలిటీలు ప్రగతి సాధిస్తాయని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఏడాదిగా మంజూరు కాని పట్టణ ప్రగతి నిధులు

ఫ చిన్నపాటి మరమ్మతులకూ

నిధుల కొరత

ఫ నిలిచిపోయిన అభివృద్ధి పనులు

నల్లగొండ 1. 26 కోట్లు

మిర్యాలగూడ 78. 91లక్షలు

హాలియా 16. 68 లక్షలు

నకిరేకల్‌ 22. 15 లక్షలు

నందికొండ 16. 62 లక్షలు

చండూరు 11. 65 లక్షలు

చిట్యాల 13. 64 లక్షలు

దేవరకొండ 23. 54 లక్షలు

మొత్తం 3.09 కోట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement