ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

నల్లగొండ: ఈ ఏడాది జిల్లాలో 57లక్షల 70 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. లతీఫ్‌ సాబ్‌ గుట్టపై మొక్కల పెంపకానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 1.65 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్‌ ఆమీర్‌ అలీ, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ శరత్‌ చంద్ర, డీఐఈఓ దశ్రు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన వైద్యం అందించాలి

నల్లగొండ టౌన్‌: నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం ఆస్పత్రిలో ఆయన హెచ్‌ఓడీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తనకు పంపించాలన్నారు. ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలు, ప్రత్యేక కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement