నక్కలగండిని సందర్శించిన ఎన్‌టీసీఏ బృందం | - | Sakshi
Sakshi News home page

నక్కలగండిని సందర్శించిన ఎన్‌టీసీఏ బృందం

Jun 18 2026 2:05 AM | Updated on Jun 18 2026 2:05 AM

చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ) బృందం బుధవారం సందర్శించింది. నక్కలగండి ప్రాజెక్టుకు 450 ఎకరాల అటవీ భూమి అవసరం ఏర్పడింది. ఆ భూమికి బదులుగా ప్రభుత్వం చందంపేట మండలంలో కోరుట్ల, ముర్పునూతల, నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద భూమిని అటవీ శాఖకు కేటాయించింది. ఆయా భూములను, నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎన్‌టీసీఏ బృందం సభ్యులు ఇక్కడికి వచ్చారు. భూముల వివరాలు తెలుసుకున్నారు. సందర్శించిన వారిలో హరిణి, ఏఐజి జివి.గోపి, సృష్టిమోడి, ఇరిగేషన్‌ శాఖ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement