చండూరు : సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని కాపాడుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


