బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

Jun 17 2026 5:21 AM | Updated on Jun 17 2026 5:21 AM

దేవరకొండ, హాలియా : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ, హాలియాలో సర్‌పై బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు శిక్షణ, బీఆర్‌ఎస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సర్‌పై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. దానిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డ్రామాలో భాగంగానే మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ రాకుండా చేశారని విమర్శించారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, సాగర్‌ మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌, బూడిద భిక్షమయ్య, ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ ఎడవల్లి విజేందర్‌రెడ్డి, సాదం సంపత్‌కుమార్‌, చింతల వెంకటేశ్వరరెడ్డి, బీల్యానాయక్‌, కిషన్‌నాయక్‌, కూరాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీష్‌రెడ్డి, సురభి రాంబాబు, వెంకటేశ్వర్లు, కంకణాల వెంకట్‌రెడ్డి, సర్వయ్య, టీవీఎన్‌ రెడ్డి, దస్రూనాయక్‌, వల్లపురెడ్డి, బొడ్డు గోపాల్‌గౌడ్‌, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, రాజినేని వెంకటేశ్వరరావు, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement