నల్లగొండ టౌన్ : జిల్లాలోని అన్ని రేషన్ షాపులలో 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కారం పొడి, పసుపు తదితర నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొండ అనురాధ, జిట్ట సరోజ, తుమ్మల పద్మ, నాగమణి, ఎస్కే సుల్తానా, ధనలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు


