వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

రామగిరి(నల్లగొండ) : వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖే కాకుండా భద్రతా సిబ్బంది, ప్రజల పాత్ర కూడా ఎంతో కీలకమైందని సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ స్టడీస్‌ కోఆర్డినేటర్‌ రామిండ్ల తిరుపతి అన్నారు. నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో వైల్డ్‌ సురక్ష పేరిట సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి ప్రవర్తనపై పోలీస్‌ సిబ్బందికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ రామిండ్ల తిరుపతి, సురక్ష ట్రైనర్‌ తిరుపతి త్రివేణి, బెటాలియన్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement