నల్లగొండ : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంది.. లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా సోమవారం నల్లగొండలోని పానగల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం, వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ మానస, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎస్పీ శరత్‌చంద్ర పవార్


