ప్రజావాణిలో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో వినతుల స్వీకరణ

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 55, ఇతర శాఖలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాట చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు నెలల నుంచి ప్రజావాణి దరఖాస్తులు పెరుగుతున్నాయని, డివిజన్‌ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్‌ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందున ఇల్లు లేని వారిని గుర్తించి, డెజిటెడ్‌ అధికారితో పరిశీలన చేయించాలని తెలిపారు. ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డీఆర్‌ఓ దశరథనాయక్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement