ఉపాధ్యాయుల్లో అపోహలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో అపోహలు తొలగించాలి

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

నల్లగొండ : ఈహెచ్‌ఎస్‌పై ఉపాధ్యాయుల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని పీఆర్‌టీయూ భవన్‌లో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేసి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు కాళం నారాయణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు సత్తయ్య, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, నక్క యుగంధర్‌, సుదర్శన్‌రెడ్డి, డీవీఎస్‌ ఫణికుమార్‌, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement