మహిళా సంఘాల సొమ్మును వీబీకే కాజేయడంపై గతంలో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– పురుషోత్తం, ఏపీఎం
చందంపేట : సంఘ బంధం సభ్యులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన సొత్తును విలేజ్ బుక్ కీపర్ (వీబీకే) స్వాహా చేసేశాడు. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలో రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు చేసి ఏడాది గడిచిపోయినా ఇంత వరకు సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సొమ్మును కూడా రికవరీ చేయలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ మహిళా సంఘం సభ్యులు రూ.2 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు గ్రామ విలేజ్ బుక్ కీపర్‌కు అప్పగించారు. సదరు వీబీకే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తన సొంతానికి వినియోగించుకున్నాడు. తీరా విషయం బయపడడంతో రేపు డిపాజిట్ చేస్తా.. మాపు డిపాజిట్ చేస్తానంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో విసుగెత్తిన మహిళా సంఘం సభ్యులు నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదైంది.
రికవరీకాని సొత్తు.. చర్యలు శూన్యం
కేసు నమోదైనప్పటికి సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కనీసం సొంతానికి వినియోగించిన సొమ్మును కూడా రికవరీ చేయకపోవడం మహిళా సంఘాల సభ్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సొమ్మును రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
ఫ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు రూ.2 లక్షలు అప్పగింత
ఫ చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వీబీకే
ఫ ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా చర్యలు శూన్యం
ఫ న్యాయం చేయాలని వేడుకుంటున్న తిమ్మాపురం సంఘబంధం సభ్యులు


