యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని దేవాదా యశాఖ కమిషనర్ కార్యాలయంలో స్థానాచార్యులు, పురోహిత్, అథర్వ వేద పండిట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్లు ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఈ మూడు పోస్టులకు గాను 23 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు మౌఖిక, రాత పరీక్షలు దేవాదాయశాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు తెలిపారు. ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని ఈఓ పేర్కొన్నారు.
శత ప్రశ్న శర సంధానం
గ్రంథావిష్కరణ
భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి సాయి అనుగ్రహ మహా పీఠంలో సిద్ధగురు రమణానంద మహర్షి రచించిన శత ప్రశ్న శర సంధానం గ్రంథాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణానంద మహర్షి మాట్లాడుతూ.. శత ప్రశ్న శర సంధానం గ్రంథంలో సాయిబాబా గురించి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. 11 భాషలలో రచించిన ఈ గ్రంథాన్ని చదవితే సాయిబాబాపై సంపూర్ణ అవగాహన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షిర్డీ క్షేత్ర సీఈఓ చంద్రబాగ మహాదేవ్, ఆత్మానందా మహరాజ్, శివప్రసాద్, ధనుంజయ్, బలరాం తదితరులు పాల్గొన్నారు.


