ప్రభుత్వ బడులను బాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులను బాగు చేయాలి

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

కోదాడ : తెలంగాణలో కొత్త బడులు అవసరం లేదని.. ఉన్న ప్రభుత్వ బడులనే బాగు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలో జరిగిన టీఎస్‌ యూటీఎఫ్‌ డివిజన్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలను పునర్‌వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అన్నారు. నాణ్యమైన వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హక్కులను, విధులను తమ రెండు కళ్లుగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌. రాములు, సోమయ్య, అనిల్‌కుమార్‌, యాకయ్య, శ్రీనివాసరెడ్డి, అరుణభారతి, వెంకటయ్య, సలీం షరీఫ్‌, తల్లాడ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చందా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement