భగవద్గీత.. మానవాళికి దివ్య సందేశం | - | Sakshi
Sakshi News home page

భగవద్గీత.. మానవాళికి దివ్య సందేశం

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

నకిరేకల్‌ : భగవద్గీత మానవాళికి మార్గదర్శకంగా నిలిచే దివ్య సందేశమని శాసనసభ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అన్నమాచార్య కళాసమితి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నకిరేకల్‌లోని శ్రీసాయి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ భగవద్గీత పారాయణం ద్వారా మనస్సుకు ప్రశాంతత ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయన్నారు. త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి మాట్లాడుతూ.. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మానవ జీవిత సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుందన్నారు.భగవద్గీత పారాయణం ద్వారా శ్రీకష్ణ భగవానుని దివ్య సందేశాన్ని గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు. అన్నమాచార్య కళా సమితి ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ గండేపల్లి సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ బింగి నరేందర్‌గౌడ్‌, డిప్యూటీ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ మాధవి వెల్లంకి, స్థానిక సాయి ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ తొనుపూనూరి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాసనసభ మాజీ స్పీకర్‌

సిరికొండ మధుసూదనాచారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement