కోదాడ : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసే బీఆర్‌ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని యువత, మహిళ, రైతులను పార్టీకి అనుసంధానం చేయడానికి పాటుపడాలన్నారు. గ్రామ బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రజల తరఫున పోరాడాలని కోరారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సుంకర అజయ్‌కుమార్, సత్యబాబు, ఎస్.కె. నయీం, చింతా కవిత, బట్టు శివాజీ, మామిడి రామారావు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్


