ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలి

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

నల్లగొండ : విద్యార్థుల సంఖ్య కనుగుణంగా పాఠశాలలను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆయన శనివారం నల్లగొండలో నిర్వహించిన టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కమిటీ సమావేశంలో నాయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పట్టణీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల వలసలతో నగరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవన్నారు. నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం 5 వేలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలన్నారు. అక్రమ డిప్యుటేషన్ల రద్దు కోసం ప్రజలను కూడా సమీకరిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, నాగమణి, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్‌రెడ్డి, అరుణ, గేర నరసింహ, శ్రీనివాస్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, భానుప్రకాష్‌, మధుసూదన్‌, పగిడిపాటి నరసింహ, ప్రభాకర్‌, బి.సురేందర్‌రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాంకుమార్‌, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement