రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్‌ అలైవ్‌ భద్రత వారోత్సవాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్‌సీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్‌ పథకం ద్వారా మొదటిసారి రూ.25వేలు, రెండవసారి రూ.50వేలు, మూడోసారి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందనుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స విధానాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఉచిత పెరుగన్నం పంపిణీలో ఎస్పీ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐలు నాగభూషణ్‌, సోమనర్సయ్య, పీఎన్‌డీ.ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌ జి.శిరీషనవీన్‌ పాల్గొన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement