రేషన్‌.. నో స్టాక్‌! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌.. నో స్టాక్‌!

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

ఖమ్మం, మహబూబాబాద్‌ నుంచి అలాట్‌..

రెండు రోజుల్లో రవాణా పూర్తవుతుంది

రాష్ట్ర కోటా కింద ఇవ్వాల్సిన బియ్యం జిల్లాలో సరిపడా లేకపోవడంతో పౌర సరఫరాల శాఖ ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి బియ్యాన్ని అలాట్‌ చేసింది. మూడు వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఆ రెండు జిల్లాల నుంచి నల్లగొండ జిల్లాకు అలాట్‌ చేశారు. స్టేట్‌ కోటా కూడా దాదాపు 70 శాతం వరకు పూర్తయింది. 30 శాతం బియ్యం రావాల్సి ఉంది. మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకే నెలలో ఇస్తుండటంతో రేషన్‌ షాపుల వద్ద నిల్వలు ఉండడం లేదు.

నల్లగొండ : రేషన్‌ దుకాణాల్లో బియ్యం లేవు. జిల్లా వ్యాప్తంగా చాలా దుకాణాల వద్ద డీలర్లు నోస్టాక్‌ బోర్డులు పెట్టారు. రేషన్‌ సరఫరాలో కేంద్రానికి సంబంధిన కోటా పూర్తికాగా.. రాష్ట్ర కోటా మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రేషన్‌ దుకాణాలకు చేరలేదు. అధికారులు ఇతర జిల్లాలను నుంచి తెప్పించడంలో జాప్యం కారణంగా జిల్లాలో లబ్ధిదారులకు సమయానికి బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.

30వ తేదీ వరకు పంపిణీ

ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఈ నెలలోనే వస్తోంది. ప్రతి నెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెలలో 30వ తేదీ వరకు బియ్యం ఇవ్వనుంది. అయితే బియ్యం పంపిణీలో సమస్యలు ఎదురవుతున్నాయి. బియ్యం పంపిణీలో ప్రభుత్వం రేషన్‌ పోర్టబులిటీ విధానం అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా కార్డుదారుడు రేషన్‌ పొందవచ్చు. దీనివల్ల కొన్ని షాపుల్లో కోటాకు మించి బియ్యం ఉండగా.. కొన్ని షాపులు బియ్యం లేక మూసివేస్తున్నారు.

5,39,864 ఆహారభద్రత కార్డులు

జిల్లాలో మొత్తం 5,39,864 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కింద 3,02,674 కార్డులుండగా.. స్టేట్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కింద 2,37,190 కార్డులు ఉన్నాయి. కేంద్రానికి సంబంధించిన కార్డులకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ గోదాముల నుంచి, స్టేట్‌ కోటా కింద ఉన్న కార్డులకు రాష్ట్ర గోదాముల నుంచి ప్రతి నెలా బియ్యాన్ని రేషన్‌ షాపులకు తరలిస్తారు. కేంద్రానికి సంబంధించి కార్డుల కోటా బియ్యాన్ని ఇప్పటికే ఆయా గోదాముల నుంచి రేషన్‌ షాపులకు అందించారు. అయితే స్టేట్‌ కార్డులకు సంబంధించి ఇంకా పూర్తి కోటా రవాణా కాలేదు. రాష్ట్రం యూనిట్‌గా చేసుకుని ఎక్కడైతే బియ్యం అవసరమో, ఏ జిల్లాలో బియ్యం ఉంటాయో ఆ జిల్లాల నుంచి అవసరమున్న జిల్లాలకు బియ్యం రవాణా చేస్తుంటారు.

రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద నల్లగొండ జిల్లాకు.. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు బియ్యం అలాట్‌ చేశారు. ఇప్పటికే అక్కడి నుంచి సగం వరకు రవాణా పూర్తయింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం తెచ్చి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచుతాం. ఈ నెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తాం.

– నాగేశ్వర్‌రావు, జిల్లా పౌరసరఫరాల

మేనేజర్‌ నల్లగొండ

ఫ రేషన్‌షాపుల్లో నిండుకున్న బియ్యం నిల్వలు

ఫ దుకాణాలకు నోస్టాక్‌ బోర్డు తగిలించిన డీలర్లు

ఫ బియ్యం సరఫరాలో పౌరసరఫరాల శాఖ జాప్యం

ఫ లబ్ధిదారులకు సకాలంలో అందని బియ్యం

Advertisement
 
Advertisement
Advertisement