ప్రమాదపుటంచున ప్రయాణం
చండూరు : పాఠశాల విద్యార్థులు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలకు చుట్టుపక్కల పల్లెల నుంచి నిత్యం ఆటోల్లో, కాలినడకన, సైకిళ్లపై ప్రయాణం చేస్తున్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో దోనిపాముల నుంచి వచ్చే విద్యార్థులు ఒకే ఆటోలో 17 మంది పాఠశాలకు వస్తున్నారు. తుమ్మలపల్లి నుంచి చండూరుకు గతుకుల రోడ్డుపై ఆటోలో 15 మందికిపైగా విద్యార్థులు వస్తూ పోతున్నారు. బోడంగిపర్తి పాఠశాలకు వచ్చే ఆటో లోపల 18 మంది, వెనుక మరో ఐదుగురు నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
ప్రమాదపుటంచున ప్రయాణం


