బస్సులేని బడిబాట!
అణిచివేయడం సరికాదు
ప్రశ్నించే వారిని అణిచివేయడం సరికాదని అరుణోదయ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు.
శిక్షపడే వరకు ఉద్యమం
కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులకు శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని మంద కృష్ణమాదిగ అన్నారు.
- 8లో
కేతేపల్లి : కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో గల మోడల్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోని విద్యార్థులే కాకుండా సమీపంలోని నకిరేకల్, సూర్యాపేట తదితర మండలాల నుంచి కూడా విద్యార్ధులు ఈ పాఠశాలకు వస్తారు. పాఠశాలలో కేవలం 100 మంది విద్యార్థినులకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది. మిగిలిన వారు రోజూ వచ్చి పోవాల్సిందే. మండలంలో హైవేపై ఉన్న ఐదు గ్రామాలకు తప్ప వేరే గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇక, కొర్లపహాడ్ గ్రామం హైవేపై ఉన్నప్పటికీ పాఠశాల మాత్రం బస్‌స్టేజీ నుంచి 3 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. నకిరేకల్ మండలం నోముల, వల్లభాపురం, కేతేపల్లి మండలంలోని గుడివాడ, ఇప్పలగూడెం, కాసనగోడు, బొప్పారం, కొత్తపేట గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఆర్థికస్థోమత లేనివారు సైకిళ్లు, కాలినడకన పాఠశాలకు వచ్చిపోతున్నారు.
నా ఇద్దరు కూతుళ్లు కొర్లపహాడ్ మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. మా గ్రామం నుంచి పాఠశాల ఐదు కి.మీ దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లేకపోవటంతో ఆటోలో పంపిస్తున్నాను. నెలకు రూ.2వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా ఇబ్బండి పడుతున్నాను. అధికారులు స్పందించి బస్సు నడిపించాలి. – ఎ.జగన్నాదం, గుడివాడ
బస్సులేని బడిబాట!


