నేడు జాబ్ మేళా
నల్లగొండ : నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్ ఉపాధి కల్పన కార్యాలయంలో 23న ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కల్పన కార్యాలయానికి బయోడేటా, ఒరిజి నల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె తెలి పారు. ఎస్‌ఎస్‌సీ నుంచి ఏదేని డిగ్రీ, ఐటీఐ, బీఎస్సీ నర్సింగ్, డీబీఎం ఫార్మసీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 7095612963 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నల్లగొండ : తెలంగాణ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ గురుకులాల ఆర్‌సీఓ ఇ.స్వప్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు.
పౌర కేంద్రిత పోలీసింగ్‌తో సత్వర న్యాయం
కనగల్ : పౌర కేంద్రిత పోలీసింగ్ విధానంతో అసహాయులకు సత్వర న్యాయం అందుతుందని కనగల్ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపారు. గురువారం మదనాపురంలో ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురవయ్యపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్రతో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడు నల్లగొండ పట్టణంలోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు బాధితుడి వద్దకు వెళ్లిన ఫిర్యాదు తీసుకొని అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆయిల్‌పామ్‌తో
అధిక లాభాలు
రామగిరి(నల్లగొండ) : ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా హర్టికల్చర్ అధికారి సుభాషిణి అన్నారు. ఆయిల్‌పామ్ సాగు యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలపై పానగల్ రైతు వేదికలో నల్లగొండ మండలం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్‌పామ్.. అధిక ఆదాయాన్ని అందించే సులభతరమైన వాణిజ్య పంట అన్నారు. ఈ మొక్కను ఒకసారి నాటితే 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పతాంజలి ఫుడ్స్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, డీజీఎం యాదగిరి, జైన్ డ్రిప్ అగ్రోనమిస్టు శంకర్ మానె, హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, ఆయిల్‌పామ్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు గురువారెడ్డి, కార్యదర్శి గురవయ్య, రైతులు కరుణాకర్‌రెడ్డి, రత్నారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాప్ ద్వారానే
ఎరువులు అందించాలి
నల్లగొండ అగ్రికల్చర్: రైతులకు యాప్ ద్వారానే డీసీఎంఎస్ సిబ్బంది ఎరువులు అందించాలని జిల్లా సహకార అధికారి, ఎన్‌డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ నాగిళ్ల మురళి అన్నారు. గురువారం నల్లగొండలోని టీఎన్‌జీవోస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా ఎప్పుడు నిల్వ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదే అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నేడు జాబ్ మేళా


