పార్టీల సన్నాహకం!
మిగతా మున్సిపాలిటీల్లోనూ
కసరత్తు వేగవంతం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు వేగవంతం చేశాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ మున్సిపాలిటీల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడబోత చేపట్టగా, బీఆర్‌ఎస్, బీజేపీ కూడా అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరికొందరు ఆశావహులు టికెట్లపై హామీల కోసం ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
నల్లగొండను
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
నల్లగొండలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు మొదలు పెట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో చేరికలను ప్రోత్సహించే దిశగా ఆయా పార్టీలు చర్యలు చేపట్టాయి. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
మిర్యాలగూడలో రంగంలోకి నేతలు
మిర్యాలగూడలో ప్రధాన పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనయుడు, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన నివాసంలో ఇప్పటికే తన అనుచరులతో చర్చించారు. బీజేపీ.. సన్నాహక సమావేశం నిర్వహించింది. ఆభ్యర్థుల ఎంపిక విషయం అన్ని పార్టీలు అచి తూచి అడుగులు వేస్తున్నారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో సర్వేలు చేయిస్తున్నాయి.
చిట్యాల మున్సిపాలిటీ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సమావేశాలను పూర్తి చేశాయి. వార్డుల వారీగా ఇతర మండలాలకు చెందిన ముఖ్య నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించి అభిప్రాయ సేకరణ చేపట్టాయి.
దేవరకొండలో టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సన్నాహక సమావేశం నిర్వహించగా, బీజేపీ సమావేశం నిర్వహించింది.
చండూరులో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సమావేశాలు నిర్వహించారు.
హాలియా, నందికొండలో కాంగ్రెస్ పార్టీ.. పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
ఫ మున్సిపాలిటీల వారీగా
సమావేశాల నిర్వహణ
ఫ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల
స్వీకరణ, పరిశీలన
ఫ అవసరమైన చోట సర్వేలు,
వాటి ఆధారంగానే టికెట్లు
ఫ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దమైన పార్టీలు


