క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
నల్లగొండ : క్రీడలతో పోలీసు సిబ్బందిలో ఆత్మవిశాసం పెరుగుతుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని పోలీస్ క్రీడా మైదానంలో యాదాద్రి జోన్–5 పోలీస్ క్రీడలు, రాష్ట్రస్థాయి జోనల్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో పాల్గొంటారని తెలిపారు. దాదాపు 140 మంది పోలీస్ క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి.. యాదాద్రి జోన్–5కు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, అదనపు ఎస్పీ వినోద్, ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ రాము, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ, కళ్యాణ్‌రాజ్, సురేష్, ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది


