జంతు సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ : వేసవిలో జంతువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. పెట్ డాగ్ దత్తత మాదిరిగా.. ఆవులను దత్తతతీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జంతువులు, పశువులకు అవసరమైన మందులు, మొబైల్ వెటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు మల్టీపర్పస్ ఎండోస్కోప్ టూల్ కిట్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈఓ బి.శ్రీనివాసరావు, డీటీఓ లావణ్య, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేశామని, 70 మంది ఆర్వోలు, 68 మంది ఏఆర్వోలను నియమించామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


