అభివృద్ధి పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

Jan 23 2026 6:33 AM | Updated on Jan 23 2026 6:33 AM

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి పట్టణ సమస్యలపై పాలకులకు చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బీజేపీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన అమృత్‌ స్కీం తాగునీటి పథకం, రోడ్లు, యూజీడీ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్‌ కల్యాణికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, బండారు ప్రసాద్‌, గోలి మధుసూదన్‌రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, నాగిరెడ్డి, నాగరాజు, వెంకన్న, వెంకటేశం, సాయి, లింగస్వామి, విద్యాసాగర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, మండల వెంకన్న, హరి, సైదులు, రామగిరి అఖిల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement