జైల్ సూపరింటెండెంట్‌గా ఆనందరావు
నల్లగొండ : నల్లగొండ జిల్లా జైల్ నూతన సూపరింటెండెంట్‌గా కె.ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ పదోన్నతిపై కేంద్ర కారాగారం చర్లపల్లి జైల్‌కు బదిలీ అయ్యారు. ఆనందరావు గతంలో నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. నల్లగొండ జైల్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆనందరావుకు జైలర్ బాలకృష్ణ, డిప్యూటీ జైలర్ వెంకట్‌రెడ్డి, జైల్ సిబ్బంది శ్రీరామ్ ఆయనకు బొకే అందజేసి శుభ కాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ నుంచిబీఆర్‌ఎస్‌లో చేరిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఏర్పుల తర్షనరవి 150 మంది కార్యకర్తలతో కలిసి బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరినవారిలో రమేష్, నాగరాజు, శ్రీను, కోటయ్య, క్రాంతి, వెంకన్న, అశోక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
జైల్ సూపరింటెండెంట్‌గా ఆనందరావు


