దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఈ నెల 30లోగా tso bmms.cgg.gov.in ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్, ట్యాప్‌టాప్, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్‌చైర్స్, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ అందజేస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9441032444 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
క్రీడలతో పని ఒత్తిడి దూరం
రామగిరి(నల్లగొండ) : క్రీడలతో పని ఒత్తిడి దూరమవుతుందని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కోర్టులో క్రీడా పోటీలను మంగళవారం ఆయయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయవృత్తిలో ఉన్న సిబ్బంది క్రీడలు ఆడడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జడ్జిలు సంపూర్ణ ఆనంద్, కులకర్ణి, పురుషోత్తంరావు, శిరీష, మేఘన, తేజ, బార్ అసోసయేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్, గేమ్స్ సెక్రటరీ జిఎన్‌ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటిషియన్ కో ర్సులో శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎ.అనిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉండి, 8వ తరగతి పూర్తయిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. కోర్సులో 25 సీట్లు ఉన్నాయని తెలి పారు. పూర్తి వివరాలకు దుర్గాబాయి మహిళా ప్రాంగణం నల్లగొండ, ఫోన్ నంబర్ (76600 22517)ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
మహిళలకు
ప్రభుత్వం పెద్దపీట
నల్లగొండ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు అన్నారు. మంగళవారం నల్లగొండలోని లైన్‌వాడి బషీర్‌బాగ్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమంలో భాగంగా బాలికలు, మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతినెలా జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మందికి శానిటరీ నాప్‌కిన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బ సాత్విక, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం


