కాషాయ జెండా ఎగరడం ఖాయం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈసారి కాషాయం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ ప్రాంతానికి రూ.400 కోట్లు తెచ్చామని మాటల గారడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మెస్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా గర్జనను నిర్వహించాలన్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాధినేని శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తంరెడ్డి, కన్మంతరెడ్డి అశోక్‌రెడ్డి, యాదగిరి, వెంకటరమణ, నాగిరెడ్డి, సత్యప్రసాద్, కర్నాటి ప్రభాకర్, రమేష్, తుమ్మలపల్లి హన్మంతరెడ్డి, ఆశాలత, వనం మధన్‌మోహన్, అశోక్‌రెడ్డి, శ్యాం, వేణు, బాషా, మూల రాజీరెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి


