బత్తాయి రైతులు లాభాలు ఆర్జించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : బత్తాయి రైతులు లాభాలను ఆర్జించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బత్తాయి రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బత్తాయి మార్కెట్ లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నమని, దళారుల చేతిలో మోసపోతున్నామని, మార్కెట్ తెరిపించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. తాము ఎఫ్‌బీఓ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ బత్తాయి ఎక్కువగా పండించే జిల్లా అన్నారు. బత్తాయి రైతుల ఆలోచనలను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో హార్టికల్చర్ జిల్లా అధికారి సుభాషిని, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, శాస్త్రవేత్త హరీఫ్‌ఖాన్, నాబార్డ్ డీజీఎం వినయ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.


