నేడు అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

నేడు అవగాహన సదస్సు

Jan 20 2026 7:35 AM | Updated on Jan 20 2026 7:35 AM

నేడు

నేడు అవగాహన సదస్సు

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులకు ఈ నెల 20న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమన్వయకర్త మారం వెంకట రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ప్రోగ్రాం అధికారులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

30న ఎన్జీ కాలేజీలో జాతీయ సదస్సు

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న తెలుగు భాషా వికాసం–వివిధ వైఖరులుపై ఒక్కరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్‌ తెలిపారు. అధ్యాపకులతో కలిసి సోమవారం సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో పాల్గొనే వారు తమ పేరు నమోదు చేసుకొని జనవరి 29వ తేదీలోపు పూర్తి పరిశోధనా పత్రాన్ని telugungc2022@gmail.comకు మెయిల్‌ పంపాలని పేర్కొన్నారు. అధ్యాపకులు రూ.1000, రీసెర్చ్‌ స్కాలర్స్‌ రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని తెలిపారు. వివరాలకు 9866977741 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పరంగి రవికుమార్‌, అంతటి శ్రీనివాస్‌, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ బత్తిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

గోపాలమిత్రల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

నల్లగొండ అగ్రికల్చర్‌ : గోపాలమిత్ర సంఘం జిల్లా కమిటీని సోమవారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొప్పెర నాగయ్య(బంకపురం), ఉపాధ్యక్షుడిగా మహేశ్వరం సతీష్‌కుమార్‌(కల్వపల్లి), ప్రధాన కార్యదర్శిగా పల్చ మహేష్‌గౌడ్‌(మైనంపల్లి)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికై న నాయకులు సభ్యులు ఘనంగా సన్మానించారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

చందంపేట : మండలంలోని పోలేపల్లి స్టేజీ వద్ద సోమవారం పలువురు రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారం రోజులుగా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్నా యూరియా ఇవ్వడం లేదన్నారు. దుకాణం వద్ద బయోమెట్రిక్‌లో సాంకేతిక లోపంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన విషయం తెలుసుకున్న ఏఓ లక్పతి జిల్లా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న రైతుల ఐడీ ఆధారంగా యూరియా అందించడంతో రైతులు శాంతించారు.

మహాశివుడికి

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. మహా శివుడికి అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే సుప్రభాతం నిర్వహించిన అర్చకులు సహస్రనామార్చనలు చేపట్టారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు నిర్వహించారు.

నేడు అవగాహన సదస్సు1
1/1

నేడు అవగాహన సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement