ఎన్నికలు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Jan 20 2026 7:35 AM | Updated on Jan 20 2026 7:35 AM

ఎన్ని

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ప్రజలకు మెరుగైన

పాలన అందించాలి

నల్లగొండ : రానున్న మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం నల్లగొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల ఆర్వోలు, ఏఆర్‌ఓల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ అయ్యే వరకు అన్ని అంశాలపై ముందే సంసిద్ధం కావాలని సూచించారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థుల డిపాజిట్‌, ఖర్చుల పరిమితి తదితర వివరాలను ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ ఎన్నికల నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాలి

ప్రభుత్వ పథకాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు సమీక్షించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాల్లో అన్ని సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి ప్రతి నెలా నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి అధికారులు పాల్గొన్నారు.

నల్లగొండ : నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. సోమవారం నల్లగొండలోని టీటీడీసీలో సర్పంచ్‌ల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్‌లు ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వారి పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ కె.అనిల్‌కుమార్‌, హైదరాబాద్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ హెడ్‌ డి.రాఘవేంద్రరావు, డీపీఓ శంకర్‌నాయక్‌, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, చొల్లేటి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి1
1/1

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement