జీజీహెచ్‌లో ప్రత్యేక నిఘా
చోరీలు జరగకుండా చూస్తాం
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) నిఘా నీడలో ఉంది. రోజూ సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు ఆస్పత్రి ప్రధాన 2 గేట్లను మూసివేస్తున్నారు. ఒక్క గేటు నుంచే వైద్యులు, సిబ్బంది, రోగుల సహాయకులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. తెరిచి ఉన్న గేటు వద్ద 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతోపాటు అన్ని వార్డులు, ఎంసీహెచ్ ఆవరణలో ఉన్న 32 సీసీ కెమెరాలను మరమ్మతు చేయించి నిఘా పెంచారు.
చోరీలను అరికట్టేలా..
ఆస్పత్రిలో గతంలో రోగుల సహాయకులతో పాటు రోగుల సెల్‌ఫోన్లు, బైక్ చోరీలు జరిగాయి. ఆస్పత్రికి ఉన్న మూడు ప్రధాన గేట్లను 24 గంటలు తెరిచి ఉంచడంతో రాత్రివేళ ఆస్పత్రిలోకి ఎవరు వస్తున్నారో.. పోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఇటీవల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన గుర్రం నర్సింహారావు ఆస్పత్రిలో చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అవుట్ పోస్టు సిబ్బందితో సమన్వయం
జీజీహెచ్‌లో పోలీసు అవుట్‌పోస్ట్ సిబ్బందితో ఆస్పత్రి సెక్యూరిటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక వాట్సప్ గ్రూప్ తయారు చేశారు. ఆస్పత్రిలో ఏదేని సంఘటన జరిగితే గ్రూప్‌లో మెసేజ్ పెట్టిన వెంటనే పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు.
ఫ సాయంత్రం 5 గంటలకే ప్రధాన
గేట్లు మూసివేత.. ఒకే గేటు నుంచి
రాకపోకలు
ఫ సీసీ కెమెరాలకు మరమ్మతు
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన గేట్లు నిత్యం తెరిచి ఉండటంతో ఎవరు వస్తుపోతున్నారో తెలియడం లేదు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో దొంగతనాలు జరుగకుండా కృషి చేస్తున్నాం. రోగులు, వారి సహాయకులు సహకరించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
– గుర్రం నరసింహరావు, సూపరింటెండెంట్
జీజీహెచ్‌లో ప్రత్యేక నిఘా


