కార్మిక, కర్షకులపై కేంద్రం దాడిచేస్తోంది
నల్లగొండ టౌన్ : దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపైన బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నల్లగొండలోని సీపీఎం కార్యాలయం నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూదోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేట్, మతతత్వ విధానాలను వేగవంతం చేసిందన్నారు. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడులను అమలు చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, బీబీజీ రాంజీ చట్టం తెచ్చిందన్నారు. వీటిని రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేశ్, కందాల ప్రమీల, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్న వెంకులు, సయ్యద్ హాశం, దండెంపల్లి సరోజ, బండ శ్రీశైలం, ఎండీ.సలీం, కంబాలపల్లి ఆనంద్, దండెంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


