మాది రైతు పక్షపాతి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

Jan 20 2026 7:35 AM | Updated on Jan 20 2026 7:35 AM

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

నల్లగొండ : మాది రైతు పక్షపాతి ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌ ఆవరణలో రూ.8 కోట్ల విలువచేసే వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. రూ. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు సంబంధించి రూ. 20 వేల కోట్ల రుణాలను రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 8 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్న కారు, మహిళా రైతులకు సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చామని, రైతులు, మహిళల కళ్లల్లో సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement