నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా

Jan 19 2026 4:13 AM | Updated on Jan 19 2026 4:13 AM

నీలగి

నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా

నాణ్యమైన వైద్య సేవలకు ప్రాధాన్యం కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుస్తారు రోజూ కృష్ణాజలాలు హైదరాబాద్‌ తరహాలో రింగురోడ్డు డ్రెయినేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తాం.. నగరంలో సీసీ, బీటీరోడ్లు నిర్మాణాలు నలువైపులా ఐదు సబ్‌ స్టేషన్లు

విద్యా రంగానికి ప్రాధాన్యం

జనరల్‌ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చేపట్టిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ఏడాదిలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చాం. రూ.150 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి కొత్త బ్లాక్‌ను నిర్మిస్తున్నాం. మెడికల్‌ కాలేజీ పెండింగ్‌ పనులను పూర్తి చేశాం. రూ.1.43 కోట్లతో మాన్యంచెల్కలో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు నూతన భవన నిర్మాణం చేపట్టాం. రూ.1 కోటి జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధులతో ఫుడ్‌ స్ట్రీట్‌ను అభివృద్ధి చేస్తున్నాం.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండకు ఎంత చేసినా తక్కువే. ఈ నగరాన్ని మెగాసిటీలతో పోటీగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశాం. నల్లగొండ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తాం, భవిష్యత్‌లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి అత్యున్నత జీవనప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్ది స్మార్ట్‌ సిటీగా మార్చాలన్నదే మా ముందున్న తక్షణ కర్తవ్యం’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ కార్పొరేషన్‌గా ప్రకటించిన తరువాత మంత్రి వెంకట్‌రెడ్డి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మా ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే పట్టణాభివృద్ధికి రూ.2 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. అవసరమైతే మరో రూ.2 వేల కోట్లు తేవడానికై నా సిద్ధమే. నల్లగొండకు ఏది కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాబోయే కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో మాతో కలిసి నడిచేవారిని ఎన్నుకుంటే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నల్లగొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది. దాదాపు అన్ని డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలవబోతున్నారని ప్రజలే చెబుతున్నారు.

నగరంలో ఇకపై ప్రతిరోజూ తాగునీటిని అందించే కార్యాచరణ చేపట్టాం. ప్రజలకు రోజూ కృష్ణాజలాలను తాగునీరుగా అందిస్తాం. ఇందుకోసం అమృత్‌ 2.0 కింద రూ.56.75 కోట్లతో నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచేందుకు కొత్తగా 11 వాటర్‌ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు చేపట్టాం. ఇవి 80 శాతం మేర పూర్తయ్యాయి. రా వాటర్‌ పంప్‌ హౌస్‌ వద్ద జనరేటర్‌ను ఏర్పాటు చేశాం. తద్వారా నీటి సరఫరాకు ఆటంకం లేకుండా పోయింది.

హైదరాబాద్‌లాంటి మెట్రోసిటీలకే పరిమితమైన రింగురోడ్డుని నల్లగొండకు మంజూరు చేయించా. రూ.545 కోట్లతో పానగల్‌ ఛాయాసోమేశ్వరాలయం నుంచి మెడికల్‌ కాలేజీ (ఎస్‌ఎల్బీసీ కాలనీ) వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే రూ.260 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో మెడికల్‌ కాలేజీ నుంచి అద్దంకి–నార్కట్‌పలి్‌ల్‌ రహదారి (దుప్పలపల్లి) వరకు గ్రీన్‌ కారిడార్‌ రహదారిని నిర్మిస్తున్నాం. దర్వేశిపురం నాలుగులైన్ల రోడ్డును రూ.50 కోట్లతో, నల్లగొండ– ముశంపల్లి రోడ్డును రూ.100 కోట్లతో, నల్లగొండ–గుండ్లపల్లి–కురంపల్లి రోడ్డు పనులను రూ.60 కోట్లతో చేపట్టాం.

నగరంలో మెరుగైన డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో అమృత్‌ 2.0 పథకం కింద రూ.216.19 కోట్లతో అండర్ర్‌గౌండ్‌ డ్రెయినేజీ, నూతన ఎన్టీపీ నిర్మాణ పనులు చేపట్టాం. రూ.53 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.109.21 కోట్ల ఎస్‌ఎఫ్‌ నిధులతో నగరంలో అంతర్గత సీసీరోడ్లు, వరదలకాల్వలు, శ్మశానవాటికల నిర్మాణ పనులు చేపట్టాం.

నల్లగొండలో అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్లను వేస్తున్నాం. రూ.14కోట్లతో బస్టాండ్‌ నుంచి మేకల అభినవ్‌ స్టేడియం వరకు బీటీరోడ్డు అభివృద్ధి పనులు, రూ.18 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో డీఈఓ ఆఫీసు నుంచి మిర్యాలగూడ రోడ్డు బీటీరోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రూ.4.01 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టాం. తాజాగా రూ.18.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా.

నగరంలో విద్యుత్‌ కోతలను నివారించడంతో పాటుగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇందుకోసం నగరం నలువైపులా ఐదు సబ్‌ స్టేషన్లను నిర్మిస్తున్నాం. బీట్‌మార్కెట్‌, చర్లపల్లి, మునుగోడు రోడ్డు, లెప్రసీకాలనీ, కలెక్టరేట్‌ వెనుకవైపున చేపట్టిన ఈ పనులన్నీ కొనసాగుతున్నాయి.

ఫ హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేస్తా

ఫ రెండేళ్లలోనే రూ.2 వేల కోట్ల పనులు చేపట్టాం

ఫ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం

ఫ నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మిస్తున్నాం

ఫ కార్పొరేషన్‌లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

‘సాక్షి’తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

పేదపిల్లలకు కార్పొరేట్‌ తరహాలో విద్యనందించడంతో పాటు, పీజీ వరకు ఉన్నత విద్య నల్లగొండలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలోనే నేను పట్టుబట్టి మహాత్మాగాంధీ యూనివర్శిటీని మంజూరు చేయించా. ప్రస్తుతం యూనివర్శిటీలో రూ.25 కోట్లతో చేపట్టిన న్యాక్‌ బిల్డింగ్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.175 కోట్లతో నిర్మించిన మెడికల్‌ కాలేజీ భవనాలను ప్రారంభించాం. రూ.40 కోట్లతో నర్సింగ్‌ కాలేజీని నిర్మిస్తున్నాం. రూ.200 కోట్లతో నగరంలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ను నిర్మిస్తున్నాం. కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.9 కోట్లతో బొట్టుగూడలోని ప్రభుత్వ హైస్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మెడికల్‌, ఐఐటీ ఫీజులను చెల్లిస్తున్నాం. రూ.85 కోట్లతో ఐటీఐలో ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించాం.

నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా1
1/1

నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement