సర్పంచ్‌లకు ‘పాలనా’ పాఠాలు
విడతల వారీగా శిక్షణ ఇలా..
నల్లగొండ : నూతన సర్పంచ్‌లకు సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. విడతల వారీగా ఐదు రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శిక్షణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టం, పాలనపై సర్పంచ్‌లకు అవగాహన కల్పిస్తారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చేందుకు రిసోర్సు పర్సన్లను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు.
బ్యాచ్‌లుగా విభజన
జిల్లాలో 869 పంచాయతీలు ఉండగా 866 పంచాయతీలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరాయి. ఎన్నికై న సర్పంచులు పాలనాపరంగా ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని సర్పంచులను తొమ్మిది బ్యాచ్‌లుగా విభజించి, ఐదు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల చొప్పున శిక్షణ ఇస్తారు. ఇందుకోసం నల్లగొండలోని రామ్‌నగర్‌లో గల టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. రాత్రి బస కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వీరికి 12 మంది ట్రైనింగ్ పొంది వచ్చిన రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు.
24 అంశాలపై..
గ్రామ పాలనలో వ్యవస్ధలు ఎలా ఉంటాయి, పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం పంచాయతీ అధికారులు ఏంటి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలు ఏంటన్నవి ఈ శిక్షణలో నూతన సర్పంచులకు బోధించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజారోగ్యం, జనన మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక.. ఇలా మొత్తంగా 24 అంశాలపై శిక్షణ ఉండనుంది. పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణ సమయంలో హాజరయ్యే సర్పంచులకు బయోమెట్రిక్ ద్వారా శిక్షణ కేంద్రంలో హాజరు సైతం తీసుకోనున్నారు.
ఫ నేటి నుంచి విడతల వారీగా శిక్షణ
ఫ 24 అంశాలపై అవగాహన
ఫ నల్లగొండలోని టీటీడీసీలో
ఏర్పాట్లు పూర్తి
విడత సర్పంచులు
మొదటి 157
రెండవ 178
మూడవ 165
నాలుగో 187
ఐదవ 179


