చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఆదివారం రాత్రి అమావాస్య కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ఈఓ మోహన్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ , సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, అర్చకులు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాలను గట్టు పైకి అనుమతించలేదు. నల్లగొండ, నార్కట్‌పల్లి నుంచి ఆలయానికి వచ్చే వాహనాలను కిలోమీటరు దూరంలో నిలిపివేశారు.


