శిశుగృహ పిల్లలను దత్తత ఇవ్వాలి
నల్లగొండ : నల్లగొండ శిశు గృహలో ఉన్న పిల్లలను వెంటనే దత్తత ప్రక్రియలోకి తీసుకురావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత అన్నారు. ఆదివారం ఆమె నల్లగొండలోని బాలసదనం, శిశుగృహలను ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పిల్లల దత్తత సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. శిశుగృహ పిల్లలకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బాలికలంతా పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం బాలసదనం, శిశుగృహ పరిసరాలు, స్టోర్‌రూమ్, డార్మెటరీలను పరిశీలించారు. శిశుగృహలో పిల్లలకు అందుతున్న సేవలను, పిల్లల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.గణేష్, సిబ్బంది ఆర్.తేజస్వి, వెంకట సింహ, నరసింహరావు, రాము, ఎల్లేశ్వర్, మహేష్, నాగలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
ఫ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరిత


